నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కందులవారిపాలెంలో విద్యుత్ కొత్త లైన్ పనులు జరుగుతుండగా, జార్ఖండ్‌కు చెందిన డోలు నారాయణ బోగే అనే యువకుడు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో గాయపడిన యువకుడిని వెంటనే కావలి ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతను కడపకు చెందిన మధు అనే గుత్తేదారు వద్ద పనుల కోసం వచ్చినట్లు సమాచారం.