నెల్లూరు జిల్లాలో మంగళవారం రాత్రి భారీ గాలులు వీయడంతో అనేకచోట్ల చెట్లు కూలిపోయాయి. సీతారామపురం మండలం కోయిలంపాడులో గాలివానకు కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. బుధవారం ఉదయం తెగిన వైర్‌ను గమనించకుండా తొక్కడంతో చలసాని వెంకట సుబ్బమ్మ అనే మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.