నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని అటవీ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసిన జగనన్న బూట్లు, బెల్టులు గురువారం దర్శనమిచ్చాయి. అధికారులు, పాఠశాలల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వీటిని బయట పడేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. బూట్లు పిల్లలకు ఉపయోగపడతాయని ఈ విధంగా బయటపడడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.