నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం గంధంవారిపల్లి హైవే పై గురువారం రాత్రి గేదెలను అడ్డు తప్పించబోయి ద్విచక్ర వాహనం బోల్తాపడడంతో సోంపల్లికి చెందిన ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయలైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన గొల్లపల్లి సురేష్ తిరుపతిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో యువకుడికి కూడా తీవ్రంగా గాయాలై చికిత్స పొందుతున్నాడు.