ఉదయగిరిలో జల్లులు… ప్రజలకు ఊరట, రైతుల్లో ఆందోళన

ఉదయగిరిలో తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు బుధవారం కురిసిన జల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. గడిచిన వారం రోజులుగా 41 నుంచి 43 డిగ్రీల వరకు ఎండలు దహించగా, ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. జల్లులతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ వర్షాలు రైతులకు మిశ్రమ భావాలను కలిగిస్తున్నాయి. ఒకపక్క భూమికి తేమ అందుతుందని ఆనందం ఉన్నా, కోత దశలో ఉన్న పంటలు తడిసి నష్టపోతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్