సీతారామపురం: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

సీతారామపురం మండలం సోంపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. సోంపల్లికి చెందిన గొల్లపల్లి సురేష్ (35) బేల్దారి మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటిపని కోసం గ్రామానికి చెందిన వినోద్‌తో కలసి చంద్రశేఖరపురం వెళ్లాడు. తిరిగొస్తుండగా అయ్యలూరివారిపల్లి వద్ద గేదె ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్