నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం గుండుపల్లి జాతీయ రహదారి దగ్గర గురువారం ఓ లారీ బోల్తా పడింది. చిన్నాగంపల్లి హైవే క్యాంపు కార్యాలయం నుంచి సీతారాంపురం వైపుగా వెళుతున్న ఓ టిప్పర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.