టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కు

జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త పొట్లూరి సుశీలమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, ఆమె కుటుంబానికి పార్టీ సభ్యత్వ బీమా కింద రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనల మేరకు జలదంకి మండల టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ పూనూరు భాస్కర్ రెడ్డి, మృతురాలి భర్త పొట్లూరి చిన్న హజరత్తయ్యకు ఈ చెక్కును అందించారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్