ఉదయగిరిలో నెలకు ఒక శనివారం ఆలయాల పరిశుభ్రత కార్యక్రమం

ఉదయగిరి నియోజకవర్గంలోని హిందూ దేవాలయాల్లో ప్రతి నెలా ఒక శనివారం ఆలయాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు VHP నేతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు, భక్తితో పాటు సామాజిక స్పృహను కలిగి ఉండాలని హిందువులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్