వింజమూరులోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని మాట్లాడారు. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త నాయకులు సిద్ధం కావాలన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో 175 నియోజకవర్గాలలో 12వ స్థానంలో ఉన్నామని, దీనిని పది రోజుల లోపల 70 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా 8 మండలాల మండల నాయకత్వం పనిచేయాలని తెలిపారు.