నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని ఘటిక సిద్ధేశ్వర ఆలయ ప్రాంగణంలో గోవుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పలు గోవుల శరీరాలపై తీవ్రమైన గాయాలై, అవి నొప్పితో విలవిలలాడుతున్నాయి. సరైన వైద్యం అందక ఈ మూగజీవాలు మౌనంగా రోదిస్తున్నాయి. భక్తులు, స్థానికులు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి, మొబైల్ అంబులెన్స్ ద్వారా తక్షణమే పశువైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ఉదయగిరి ప్రాంతాల్లో కలకలం రేపింది.