నెల్లూరు జిల్లాలో విషాదం... పాము కాటుతో మహిళ మృతి

నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామ హరిజనవాడలో విషాదం నెలకొంది. హరిజనవాడకు చెందిన అంకి. పుష్ప (39) శనివారం పాముకాటుతో మృతి చెందింది. వేపకాయల కోసం వెళ్లిన ఆమెను పాము కాటు వేయడంతో మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఈమె భర్త కూడా రెండు నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్