వింజమూరులో జరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు అర్లపడియ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. గ్రామం నుంచి వాహనాల ద్వారా సమూహాలుగా బయలుదేరిన శ్రేణులు సభలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సభ విజయవంతం కావాలని లక్ష్యంగా పెట్టుకున్న కార్యకర్తలు ముందుగానే ఏర్పాట్లు చేసుకుని, భారీగా హాజరై పార్టీ పట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు.