ఉదయగిరి: ఇంకా లభ్యం కాని మృతదేహం

ఉదయగిరి మండలం, గండిపాలెం జలాశయంలో మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సౌరబ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బుధవారం గల్లంతైన యువకుడి మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. ఉదయగిరి ఎస్సై-2 ఆలా శ్రీనివాసులు నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది సహకారంతో పలు ప్రయత్నాలు చేపట్టినప్పటికీ మృతదేహం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సిబ్బంది నిరంతరంగా కృషి చేస్తున్నప్పటికీ ఫలితం దక్కలేదు.

సంబంధిత పోస్ట్