ఉదయగిరి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిడిపిఓ సునీత తెలిపారు. గురువారం కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలన్నారు. బాలింతలు, గర్భిణీలను కేంద్రానికి పిలిపించి తల్లిపాల అవశ్యకత, ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు చేపట్టాలన్నారు.