మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, ఇంటి స్థలాలు, విద్యుత్, నీటి సమస్యలు, ఆస్తి గొడవలు తదితర వాటి గురించి వినతి పత్రాలు అందజేశారు. అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు వాటిని అందజేసి పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.