పదోతరగతిఫలితాల్లోఉదయగిరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘనవిజయం

నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఎల్. సి. పౌర్ణమి 600కు 589 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, పి. జికిరా 578, ఓరుగుంట శరత్ చంద్ర సాయి 573 మార్కులు సాధించారు. మొత్తం 12 మంది విద్యార్థులు 550కి పైగా, 23 మంది 500కి పైగా మార్కులు సాధించారు. పాఠశాల మొత్తం 93 శాతం ఉత్తీర్ణత సాధించింది. విద్యార్థుల ఈ ఘనతపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్