సోమశిల జలాశయం పరిశీలనకు వెళ్లకుండా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరులోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అక్కడికి చేరుకుని కాకానిని కలిసి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడే హక్కు లేదా అని మేకపాటి ప్రశ్నించారు.