ఉదయగిరి: దళితవాడ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి-2 తోట శ్రీనివాసులు ఉదయగిరి దళితవాడలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సోమవారం తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలోని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ బోధన, అభ్యసన సామాగ్రితో విద్యార్థులకు బోధన చేయాలని, సకాలంలో సిలబస్ ను పూర్తి చేయాలని, విద్యార్థుల హాజరు శాతం పెరిగే విధంగా చూడాలని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సంతృప్తిగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్