వింజమూరు తహసిల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని అన్ని గదులను పరిశీలించారు. అధికారులపై ఫిర్యాదులు అందగా, వారిని పిలిచి మందలించారు. ఇంకోసారి ఇలా జరిగితే సహించేది లేదని, మానవతా దృక్పథంతో పేదవారికి సహాయం చేయాలని అన్నారు. పేదవారిని కూడా కార్యాలయం చుట్టూ తిప్పడం పద్ధతి కాదని హెచ్చరించారు. 15 రోజుల వ్యవధి లోపల ఇచ్చిన సమస్యలను పరిష్కరించాలన్నారు.