పెన్షన్లు పంపిణీ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే

కొండాపురం మండలం ఆదిమూర్తిపురంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శనివారం ఉదయం లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. నెలకు ఒక రోజు ముందే పింఛన్లు అందించడం కూటమి ప్రభుత్వ ఘనత అని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఆదినారాయణ, టీడీపీ మండల నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్