ఉదయగిరి: హాస్పిటల్ లో టిడిపి నేతను పరామర్శించిన ఎమ్మెల్యే

వరికుంటపాడు మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఆండ్ర బాల గురవారెడ్డి ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్‌లో గాయపడి నెల్లూరు వీకే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం హాస్పిటల్‌కు వెళ్లి ఆండ్ర బాల గురవారెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొని, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్