ఉదయగిరి: బీజేపీలో చేరిన ముస్లిం నాయకుడు ఆబీద్ అలీ

బుధవారం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, ఉదయగిరికి చెందిన ముస్లిం నాయకుడు షేక్ బుడ్డుభాయ్ ఆబీద్ అలీ బీజేపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి సమక్షంలో ఆయనకు కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆబీద్ అలీ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి పార్టీలోకి ఆహ్వానించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సేవలో చురుకుగా పాల్గొంటానని, బీజేపీ అభివృద్ధి, బలోపేతానికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్