ఎమ్మెల్యే కాకర్లను కలిసిన ఉదయగిరి నూతన ఎస్సై

ఉదయగిరి నూతన ఎస్సైగా బి. మహేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ, ప్రాంతంలో శాంతి భద్రతలను పటిష్టం చేయాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, 'ఫ్రెండ్లీ పోలీసింగ్'ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, సహచర సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంపొందించేలా కృషి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్