ఉదయగిరిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చూడాలని శనివారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పలువురు విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ షాజియాకు వినతిపత్రం అందించారు. కొన్ని సంవత్సరాలుగా ఉదయగిరి ప్రాంతం వివక్షతకు గురై అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలన్నారు.