ఉదయగిరి: వెంకట్రావుపల్లి గంగమ్మ ఆలయంలో చోరీ

ఉదయగిరి మండలం, కొండాయపాలెం పంచాయతీ వెంకట్రావుపల్లి ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న గంగమ్మ ఆలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఆలా శ్రీనివాసులు పరిశీలించగా, ఈ ఘటనలో 8 గ్రాముల అమ్మవారి బంగారు తాళిబొట్టు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్