ఉదయగిరి: విశాఖ బస్ సర్వీస్ యధావిధిగా కొనసాగించాలి

జేవీవీ నాయకుడు షేక్. దస్తగిరి అహ్మద్, ఉదయగిరి నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ బస్ సర్వీసును యథావిధిగా కొనసాగించాలని కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లుగా మంచి ఆదాయంతో నడుస్తున్న ఈ సర్వీసును రద్దు చేయాలంటూ DPTO ఆదేశాలు ఇవ్వడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందించి, ఈ సర్వీసు కొనసాగించేలా అధికారులతో మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సర్వీస్ నిలిచిపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్