నాగిరెడ్డిపాలెం పొలాల్లో గుర్తుతెలియని మృతదేహం

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగిరెడ్డి పాలెం పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం సోమవారం లభ్యమయింది. ఉదయం పొలాలకు వెళ్లిన ఓ రైతు పొలం పక్కన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్