ఉయ్యాలవాడ, శివాజీ జయంతి: పలువురికి జాతీయ పురస్కారాలు

కర్నూలులోని టీజీ కళాక్షేత్రంలో బి.ఇ.ఎన్.డి.ఎస్.ఆర్.కె.ఎల్ కళా సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘురాములు డీఎస్పీ మహబూబ్ బాషా, కళాతపస్వి పత్తి ఓబులయ్య చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హాని ఫౌండేషన్ చైర్మన్ హానివర్ష రెడ్డి, సినిమా డైరెక్టర్ మౌలాలి భాష తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 2026-04-27న జరిగింది.

సంబంధిత పోస్ట్