వింజమూరు: అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు

నెల్లూరు జిల్లా, వింజమూరు పరిధిలోని జీబీకేఆర్ ఎస్టి కాలనీ సమీపంలో ఆదివారం ఒక కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. వింజమూరు నుండి దుత్తలూరు వెళ్తున్నప్పుడు, మరో కారును ఓవర్‌టేక్ చేయబోయి ఈ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్