కర్నూలు జిల్లాలో మూడు రోజుల క్రితం జరిగిన బస్సు దగ్ధ ఘటనలో వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో DNA పరీక్ష నిర్వహించి గుర్తించారు. రమేశ్, అనూష, శశాంక్, మన్విత మృతదేహాలను ఆదివారం రాత్రి స్వగ్రామానికి తరలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఎమ్మెల్యే కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు.