ఉదయగిరి ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు చల్లని, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు సహోపాధ్యాయిని షేక్ రజియాబి రూ. 10 వేల విలువైన వోల్టాస్ వాటర్ ప్యూరిఫైయర్ కూలర్‌ను పాఠశాలకు విరాళంగా అందజేశారు. దీంతో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం మెరుగుపడనుంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు రజియాబికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె సేవాభావాన్ని అభినందించారు.