జలదంకి మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా అశోక్, గత 25 రోజులుగా ధాన్యం ఆరబోసుకుని గోతాల కోసం ఎదురుచూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ ప్రెసిడెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనకు గోతాలు అందకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు జరుగుతున్నప్పటికీ, గోతాల లేమితో తన ధాన్యాన్ని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నానని, సొసైటీ చుట్టూ తిరుగుతున్నా 'ఇస్తాం' అని చెప్పడం తప్ప అమలు చేయడం లేదని ఆయన వాపోయారు.