రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

దుత్తలూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పీట్ల నవీన్ (21) అనే వరి కోత యంత్రాల ఆపరేటర్, పని నిమిత్తం ఉదయగిరి వెళ్లి తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా సోమలరేగడ ఎస్సీ కాలనీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. మొదట ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు, ఆపై పరిస్థితి విషమించడంతో ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించగా, అక్కడ వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్