AP: రాష్ట్ర ప్రభుత్వం 'సుస్థిర విద్యుత్ వాహన పాలసీ(4.0)'లో భాగంగా ఆర్టీసీని ఆధునీకరిస్తోంది. 2031 నాటికి 8,375 డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం 'పీఎం ఈ-బస్ సేవా' పథకం కింద 1,050 బస్సులు కేటాయించగా, తాజాగా మరో 1,450 విద్యుత్ బస్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త బస్సుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ నేరుగా టెండర్లు పిలవనుంది.