ప్రభుత్వ ఉద్యోగుల క్రమశిక్షణా చర్యలపై కొత్త మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల క్రమశిక్షణా చర్యలపై (Disciplinary Cases) కొత్త మార్గదర్శకాలతో G.O.MS.No. 177 విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, విచారణ అధికారులపైనే పూర్తి జవాబుదారీతనం ఉంటుంది. ఛార్జ్ మెమో నుంచి తుది తీర్పు వరకు నిర్ణీత గడువులోనే విచారణలు ముగించాలి. జాప్యం జరిగితే విచారణ అధికారులపైనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. జిల్లా కలెక్టర్లు, HODలు పెండింగ్ కేసులను నిరంతరం సమీక్షించాలి. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్