ఏపీలో కొత్తగా ఎన్‌టీపీసీ అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌!

దేశంలోని అగ్రగామి విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ, ఆంధ్రప్రదేశ్‌లో అణు విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 700, 1000, 1600 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అవసరమైన ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని, అందులో 30% వాటాను ఎన్‌టీపీసీ సాధించాలని భావిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్