స్పౌజ్ కేటగిరి కింద కొత్త పెన్షన్‌లు.. జులై 1 నుంచి పంపిణీ

AP: ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. స్పౌజ్ కేటగిరి కింద కొత్తగా 7,792 మందికి పింఛన్లు మంజూరు చేయగా, జులై 1 నుంచే వారికి కూడా నగదు పంపిణీ చేయనున్నారు. జులై నెల పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.2,711 కోట్లను విడుదల చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 62.19 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందనున్నాయి. కొత్త స్పౌజ్ లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా రూ.3.12 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రంలో 2.20 లక్షల మంది వితంతు పింఛన్ అర్హుల వివరాలను పరిశీలిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్