AP: ఏపీలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా వెల్లడించారు. ఈ పంపిణీ కార్యక్రమం ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందన్నారు. అలాగే ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 29,796 షాపుల్లో సరుకులు పంపిణీ చేస్తారన్నారు.