ఏపీపీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. రాతపరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష జనవరి 27, 31, ఫిబ్రవరి 9, 11, 12 తేదీల్లో, సంబంధిత సబ్జెక్టు పేపర్ల పరీక్షలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించనున్నారు. విశాఖ, తూ.గో., NTR, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్షలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్