గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎలాంటి కెమెరాలు దొరకలేదని ఏలూరు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు గురించిన ఆయన కీలక వివరాలు వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు విచారణ జరిగిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశామన్నారు. అయితే తమ దర్యాప్తుల్లో బాలికల హాస్టల్లో ఎటువంటి స్పై కెమెరాలు లభించలేదని తెలిపారు.