AP: వైసీపీకి నెల్లూరులో పెద్ద షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల డిసెంబర్ 18న నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కోసం సమావేశం నిర్వహించాలని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఒక వైసీపీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కోసం ఉత్తర్వులు రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.