AP: కోర్టు కేసుల కారణంగా 23 పట్టణ సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వివాదాలు పరిష్కారమైన తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. ఈ జాబితాలో SKLM, RJY, KKD, మంగళగిరితాడేపల్లి కార్పొరేషన్లు; ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, NRT, BPT, కందుకూరు, కావలి, గూడూరు, SKHT మున్సిపాలిటీలు; B. కొత్తకోట, అల్లూరు, పొదిలి, చింతలపూడి నగర పంచాయతీలు ఉన్నాయి.