కరెంట్ ఛార్జీలు పెంచబోమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చినా, ప్రజలపై భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంత్రులు, అధికారులతో బుధవారం జరిగిన సమావేశంలో, గత వైసీపీ ప్రభుత్వం పీపీఎలను రద్దు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.