AP: మాజీ సీఎం వైఎస్ఆర్ గురించి మాట్లాడుతూ విలేకర్ల సమావేశంలో బొత్స సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. అనంతపురం జిల్లాలో సీపీఐ పాదయాత్రలో పాల్గొన్న షర్మిల, వైఎస్ విజయమ్మను అవమానించినందుకు బొత్స సత్యనారాయణ ఎంతగా ఏడ్చినా తక్కువేనని అన్నారు. నిండు సభలో విజయమ్మను అవమానించి, వైఎస్ఆర్‌ను చులకన చేసి మాట్లాడారని, అమ్మ ఇంటికి వచ్చి చాలా బాధపడిందని షర్మిల ఆరోపించారు.