స్క్రబ్ టైఫస్ పట్ల ఆందోళన వద్దు: హెల్త్ కమిషనర్

AP: స్క్రబ్ టైఫస్ జ్వరాల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని హెల్త్ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 30 వరకు 736 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. శరీరంపై నల్లమచ్చ కనిపించి, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిగ్గర్ మైటు అనే పురుగు కుట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్