AP: విజయవాడలో రేపు జరగాల్సిన వైసీపీ డీఎస్సీ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. విజయవాడలో సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని, వీఐపీ జోన్లో ర్యాలీలకు అనుమతులు లేవని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ర్యాలీకి అనుమతి ఇవ్వాలని దేవినేని అవినాష్ కోరారు.