బాపట్ల జిల్లా సూరేపల్లి గ్రామంలో 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీకి అమరావతిని రాజధానిగా చేస్తూ కేంద్రం రాజముద్ర వేసిందని, దానిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. అమరావతిని కట్టలేమని విమర్శించే వారికి చేతల్లోనే సమాధానం చెబుతానని, హైదరాబాద్‌ను మించిన అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. 1000 మంది సైకోలు వచ్చినా అమరావతిని ఆపలేరని ఆయన అన్నారు.