వైసీపీ హయాంలో ఎలాంటి స్కామ్ జరగలేదు: కాకాణి (వీడియో)

AP: వైసీపీ హయాంలో ఎలాంటి స్కామ్ జరగలేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరగకపోయినా.. చంద్రబాబు రోజుకో కథ అల్లుతున్నారు. తొలుత లిక్కర్ స్కామ్ రూ.లక్ష కోట్లు అని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రూ.44 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు వేసిన సిట్ రూ.3 వేల కోట్లు అని చెబుతోంది. స్కామ్ జరగలేదు కాబట్టే.. రోజుకో అంకె చెబుతున్నారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕