AP: గత ప్రభుత్వంలో ఒక్క DSC కూడా నిర్వహించలేదని, కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ గా మారిందని, 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని, ఇప్పటివరకు 30,500 ప్రభుత్వ ఉద్యోగాలు, 6,28,327 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.